24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌..

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌..

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌..

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. ‘A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావు ర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జోయ్ బ‌రువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసారు.

Leave a Comment

OPEN IN APP