అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!!

అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!!

అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!!

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది..

నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం..

'నిన్నుకోరి ' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు..

దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు..

రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు..షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..

పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది..

Leave a Comment

OPEN IN APP